పుట:ద్విపద భారతము - ఆది సభా పర్వములు.pdf/126

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ద్విపద భారతము


గరుణ యించుక లేక కద్రువ యలిగి :
“గురుకార్యవిముఖులు క్రూరులు మీరు
నాపుత్త్రులని నేను నమ్మితిఁ గాక.
యీపొత్తు లేమెత్తునే మత్తులార!
జనమేజయుఁడు సేయు సర్పయాగమునఁ
బనివడి భస్మమై పడుదురుగాక;"
అని శాపమిచ్చెఁ బాయక [1] పుత్త్రులకును.
ఘనతపఃఫలములు గడ తేర, నపుడు
పెలుచ నీరీతి శపించిన, మదినిఁ
గలఁగి, యెంతయు భీతిఁ గర్కోటకుండు
శాపభయంబున సంప్రీతిదోప
నేపునఁ దల్లితో నిట్లని పలికె:
'జనని, నీపంచినజాడ నేఁ బోయి
ఘనహయవాలభాగముఁ గప్పువాఁడఁ;
బెనఁగిచేసెద.' నన్నఁ బ్రియమంది యనుపఁ,
గొనకొని కర్కోటకుం డేఁగి యపుడు
కామరూపమునఁ దురగమువాల మలమి,
రోమము ల్గడునీలరుచులఁ గావించి
కొనియుండె వేడ్క గర్కోటకుం డంతఁ,
గనుపట్టెఁ బూర్వదిక్కాంత భానునకు
మొనసి కానుక మొల్లమొగ్గలబంతి
ఘనముగాఁ జేసినగతి వేగుఁజుక్క
పొడిచిన శశికాంతిపొడుపు లోలోన
నడఁగంగఁ, గుముదంబు లంత ముడుంగ,
భీతిఁ జీఁకటి కకాపికలుగాఁ బాఱ

బ్రీతి నిశాకాంత పెద్ద కాలంబు
  1. క్రూరులకును (మూ)