పుట:ద్విపద భారతము - ఆది సభా పర్వములు.pdf/119

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆది పర్వము; ప్రథమాశ్వాసము

57


నవనవరత్నజన్మప్రదేశంబు,
భువనసంస్తుతపుణ్యభువనాకరంబు,
క్రూరకర్కటసంఘకుగ్రాహకంబు,
ఘోరాహి మకర [1]కుర్కుర దర్దురాది
యాదోన్వితంబు, మర్యాదాన్వితంబు
నై [2]దట్టమైన బృహత్తరంగముల
నొదవి, పెల్లొదవు నయ్యుదకబిందువులు
[3] చదునైన ముత్యాలసరములు గాఁగఁ,
గమలంబులకు మూఁగు గండుతుమ్మెదలు
సముచితనీలకేశంబులు గాఁగఁ,
[4]గలఁకమైఁ బొదలు చొక్కంబైన నురువు
పొలుపైన వెలిపట్టుపుట్టంబు గాఁగఁ,
గడఁకతో వాహినీకాంతలు దన్నుఁ
గడునెయ్యమునఁ గొల్వ గంభీరయుక్తిఁ
దనరు నంభోరాశితటమున మెలఁగు
వననిధిజనితగీర్వాణహయంబుఁ
గని, చోద్య మంది, యాకద్రువ వినతఁ
గనుఁగొని పల్కెను గర్వవాక్యముల :
"అల్లదె! చూచితె! యశ్వరత్నంబు;
తెల్లచంద్రికఁ దెగడు దేహంబుతోడ
లాలితంబైన వాలప్రదేశమున
నీలమైయున్నది నెఱిఁజూడు". మనినఁ
గనుఁగొని, నవ్వి, యాకద్రువతోడ
వినత యిట్లనియెఁ బ్రవీణతతోడ :
"ఏ తెఱంగునఁ జూచితే తురంగంబు!
బ్రాఁతిమైఁ దారహారంబులపొలుపు,

  1. దుద్గురు
  2. దట్టమై ద్రుహంతారంగములను
  3. చదురులై
  4. గదలమై (మూ)