పుట:ద్విపద భారతము - ఆది సభా పర్వములు.pdf/117

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

55

ఆది పర్వము


ఆ వేళ బ్రహ్మయు, నమరసంఘంబు,
నావీరవరుల నారాయణు నరునిఁ
బలుతెఱంగులఁ బ్రీతిఁ బ్రస్తుతి చేసి ;
రెలమితో భువనంబు లెంతయు నలరె.
అమరు లప్పుడు ప్రమోదాత్ములై మించి.
రమరశేషుఁడు మంథరావనీధరముఁ
గొనిపోయి, తొల్లింటికుదురుపట్టుననె
యసువార నిలిపె సత్వాన్వితుండగుచు.
అయ్యెడ, సురలెల్ల నాసుధారసము
చయ్యన మంథరాచలమున దాఁచి,
కడుజతనంబునఁ గావలివెట్టి,
తడయక యా రమాధవుని సేవించి
నడవ, నద్దేవుఁ డున్నతవైభవమ్ము
పొడమఁగ వైకుంఠపురమున కేఁగి,
యరయ నబ్జజ సురేంద్రాదుల నెల్లఁ
బురడించి నిజపురంబులకుఁ బోఁబనిచి,
మానుగా శ్రీవధూమణితోడఁ గూడి
పూని లోకంబు లింపుగ నేలుచుండె .
అజుఁ డంతఁ దనదు [1]సత్యలోకమునకు (?)
నజితసౌఖ్యంబుతో నమరులు గొలువ,
విచ్చేసి, యమరుల వీక్షించి, కరుణ
నచ్చుగా వేర్వేఱ నర్థి వీడ్కొలిపి,
శారదాసహితుఁడై సతతసౌఖ్యములు
మీఱ లోకములు నిర్మింపుచునుండె.
పరఁగ నింద్రుండు దిక్పతులెల్ల గొలువ
దిరముగా నమరావతీపురి కేఁగి,

  1. సత్యా (మూ )