పుట:ద్విపద భారతము - ఆది సభా పర్వములు.pdf/110

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

48

ద్విపద భారతము


నవనిధానములు నున్నతిఁ గొల్వ మించి,
భువనంబులెల్ల నప్పుడు వెలిగించి,
లాలిత జఘనవిలాససంపత్తి
మై లక్ష్మి యుదయించి యబ్జాక్షుఁ గాంచి,
మందస్మితోత్సాహమండలి వెలయ
నిందిర యవ్విష్ణు నెలమితోఁ జేరి,
బింకంపుఁబ్రియమును బ్రేమయు నొఱపు
నంకురింపఁగ రెప్పలల్లార్చి చేరి,
తనచేతి మందారదామ మాదటను
ననువార నద్దేవునఱుత వేయుటయుఁ,
జెలువారె నీలాద్రిశిఖరంబుఁజుట్టి
మలసిన తారకామాలికకరణి.
అంత వాణియు, గిరిజా, [1]శచి, దేవ
కాంతలు, దానవాంగన లటు చూచి
భాసిల్ల గళ్యాణపాటఁ బాడుచును
సేసలువెట్టి రూర్జితవైభవమున.
శూలియు నాతమ్మిచూలియు నొక్క
చో లీలఁ బంకజాక్షుని డాసియుండ,
నాపయోధీశ్వరుఁ [2]ఁ డమలోదకముల
నాపద్మనేత్రు పాదాబ్జము ల్గడిగి,
యమరగురుఁడు కన్యావరణంబు
క్రమముతోఁ బఠియింపఁగా ధారవోసె ,
అటమీద శోభనవ్యాపారమెల్లఁ
బటుభంగితోఁ గొదవడక సాగంగ,
గురులీల నాజగద్గురులవివాహ
మరుదార భువనత్రయాధారమయ్యె.
ఆమాధవునకుఁ దోయధివల్లభుండు

భామనోహర కౌస్తుభాభరణ మొసగె.
  1. శచీదేవి
  2. నమరలోకముల (మూ)