పుట:ద్విపద భారతము - ఆది సభా పర్వములు.pdf/108

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

46

ద్విపద భారతము


ద్వాదశాదిత్యులు, వడి రుద్ర[1]సంఘ,
మాదినవబ్రహ్మ, లష్టవసువులుఁ,
దుంబుర నారదాదులును గీతామృ
తంబుల నెయ్యంబు దనర నోలార్పఁ
గడువేగమునఁ బోయి కంజభవాదు
లడరువేడుకఁ గొలువైయున్నశంభుఁ
గనుఁగొని, ప్రణమిల్లి, కరములు మొగిచి
వినుతించి : "శంకర, విశ్వ, లోకేశ,
అభయంబు గౌరీశ! యభయంబు దేవ!
అభయంబు ఫాలాక్ష ! యభయంబు రుద్ర!
అభయంబు మురహరార్చితపాదపీఠ!
అభయంబు [2]సూర్యచంద్రాగ్నిలోచనుఁడ!
జాలభీతిల్లి నీశరణుచొచ్చితిమి.
అమ్మహావిషవహ్ని నడఁగించి, కరుణ
మమ్ము రక్షింపుము మదనసంహార!”
అని యర్తులగువారి కభయంబు లిచ్చి,
మనసిజారియు సభామధ్యంబు వెడలి,
క్రొన్నెల మకుటంబుకొనఁ జెన్నుమీఱ
మిన్నేఱు జడలలో మేకొని తూలఁ,
బేరురంబున సర్పపేరు నర్తింప
గారవంబున [3]సర్పకటకంబు లమర,
బూని భస్మంపుమైపూత రాగిల్ల,
మానిత సింహచర్మము కటి నమర,
నతిసమున్నతవృషభారూఢుఁ డగుచుఁ,
దతభంగిఁ బ్రమథులు తన్ జేరికొలువ

  1. సంఖ్య-లా
  2. శశిరవియగ్నిలోచనుఁడ
  3. సప్త (మూ )