పుట:ద్విపద భారతము - ఆది సభా పర్వములు.pdf/107

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆది పర్వము

45


లాదిగా బలసి సదైశ్వర్యలీల
నాదిప్రమథగణేంద్రావలి గొలువ
వీరేశ షణ్ముఖ విఘ్నేశ్వరులును
జేరి నన్నుతిసేయఁ, జెలువొప్ప మునులు
సనకసనందనసంయమీశ్వరులు
ననుఁగులై నిజహృదయాబ్జముల్ పూన్ప,
నుపమన్యు వామదేవ పవిత్రపాణి
కపిల కణ్వాగస్త్య కౌశిక సుబల
శ్వేత దధీచి వశిష్ఠ కణ్వాత్రి
గౌత మాంగీరస కశ్యప నీల
మాండవ్య హరితి మార్కండేయ పులహ
శాండిల్య వత్స కుత్స పులస్తి శక్తి
బాదరాయణ భృగు భగ దాల్భ్య రురు శి
లాద మౌద్గల్య పర్ణాద శాకల్య
గర్గ శౌనక చతుష్కర్ణ మృకండు
భార్గ వాంగిరస విభాండక శునక
మైత్రేయ బల్లకి మంకణ చ్యవన
మిత్రావరుణ నార దాత్రి సౌవర్ణ
పైల సుమంతు సుబ్రహణ్య మంద
పాల సుమిత్ర రైభ్యక సత్య సుమహ
పర్వత జైమిని పౌలస్త్య గార్గ్య
[1]దుర్వాసుఁ డాదిగాఁ దొడరి సంయములు
వెలయు నాశీర్వాదవేదనాదముల
నలరుచు నంతంత నలిఁ గీర్తిసేయ,
సుర నర దనుజు లచ్చుగ సిద్ధ సాధ్య

గరుడ గంధ ర్వోరగ ప్రకరంబు,
  1. పూర్వపుటలోని "గజకర్ణ" మొదలు ఇంతవఱకు బసవ పురాణములోని గ్రంథము. గ్రంథకర్త దానిని అనువదించియుండును.