పుట:ద్విపద భారతము - ఆది సభా పర్వములు.pdf/105

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆది పర్వము

43


వెసఁ బెక్కు జనియించి [1]వివిధవృక్షములు
పసచూపె నాకాశభాగంబునందు.
అత్తఱి వాసుకి నన్నగంబునకు,
దత్తరంబునం దరిత్రాడుగాఁ జుట్టి,
యమరులు పుచ్ఛంబు, నసురనాయకులు:
సముదగ్రగతి ఫణజాలంబుఁ బట్టి,
యుడుగనికడఁకతో నొండొరుఁ గడవ
వడి సముత్సాహదుర్వారులై తిరుప
నాధారహీనమై యప్పు డామథన
భూధరేంద్రము బుడబుడరవముతోడ
నడిఁకి పాతాళంబునకు గ్రుంగిపోవ
నడరి విష్ణుఁడు కూర్మమై యది దాల్చె.
అతులప్రమోదులై యమరదానవులు
ధృతి నంబురాశి మథించునవ్వేళ,
శరనిధి మథనఘోషము నింగిముట్టె
యురుతరమగు భార ముర్వికిఁ బుట్టె.
సురవిద్విషామరస్తోమార్భటముల
వరుస నాశామదావళములు [2]మ్రొగ్గె
గరిమతో మథనవేగంబున, నెగసి
యురవడి దట్టమై యుదకబిందువులు
నెఱసి కప్పిన, రశ్మి నిగుండగలేక
పరఁగ భానుఁడు మాఁగువడి మింటనిలిచె
పొలుచువాసుకిమొగంబునఁ బొగల్ వెడలె;
నిలువక మంటలు నిగుడి మిన్నంటెఁ;
దగ జవంబులుమాని దనుజగీర్వాణు

లగణితవిషవహ్ని కతిభీతులైరి.
  1. విశద
  2. మ్రోగె (మూ)