పుట:ద్విపద భారతము - ఆది సభా పర్వములు.pdf/101

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆది పర్వము

39


కరచతుష్టయమున ఘనశంఖ చక్ర
వరగదా నందక వ్రాతంబు వెలుఁగఁ,
బ్రాతరంభోజాప్తుభాతిఁ గిరీట
మాతతకాంతుల నమరి దీపింపఁ,
దొలఁగక రవియుఁ జంద్రుఁడు ప్రకాశమునఁ
దెలివొంది కనుల నుద్దీప్తిఁ బొల్పెసగ,
నమలినపీతాంబరాంచలద్వయము
కమనీయగతి రెండుగడలఁ దూఁగాడ,
హారకిరీటహేమాంబరాభరణ
చారుభూషణవిభాచ్ఛటలు శోభిల్ల,
ఫణికులేశ్వర యక్షపతులు సద్భక్తి
మణిమయచ్ఛత్రయుగ్మమ్ము ధరింప,
నెమ్మి నీశానుండు నిర్జరేశ్వరుఁడు
ప్రమ్మి ముందఱ బరాబరి సేసి నడువ,
వరుణదేవుఁడు గంధవహుఁడుఁ గా [1] లూఁది
వరుసతోడుత నాలవట్టముల్ వైవఁ,
బ్రకటించి యముఁడును రాక్షసేశ్వరుఁడు
[2]నకుటిలమతితో జయముపెట్టుచుండ,
నరవిందసంభవుం డర్ధిమై వెనుక
గురుతరభక్తిమైఁ గొలిచి యేతేర,
నుగ్రతేజులు ప్రతాపోగ్రమానసులు
నిగ్రహానుగ్రహనిపుణులౌ మునులు,
ఘనయశులైన కింకరులసంఖ్యములు
నెనసినభక్తిమై నెనసి సేవింప,
బ్రహాండచయములఁ బాలించునట్టి

జిహ్మగశాయి యాశ్రితరక్షకొఱకు
  1. కాలాది
  2. సకుటిలమతితోడ జయపెట్టుచుండ. (మూ)