పుట:ద్విపద భారతము విరాట పర్వము.pdf/99

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

విరాటపర్వము - ఆ -2

85


అని యాత్మఁ జింతించి యంగనారత్న
మొనరిన చెమటచే నొడ లెల్లఁ దడియ
నింతితో నిట్లను : " నే మందు నిన్ను?
ఇంతకు వచ్చెనా యెన్నంగ నేఁడు ?
ఏ మని పిలిచితి, వేమిగాఁ జూచి,
తే మున్ను నీతోడ నేమి చెప్పితిని ?
నీచపుఁజనులకు నే నొల్ల నంటిఁ,
గీచకునింటి కేక్రియఁ బుత్తురమ్మ :
కల్లు తెచ్చుట కేను గా కున్న నేమి
తల్లి నీయొద్ద నెందఱు లేరు సతులు
మగ వారిసన్నిధి మఱఁగి నీ యింటఁ
దగ వొప్ప మెలఁగీతిఁ దాల్మి వాటించి.
నిరుపమశీల వౌనీయిల్లు దలఁప
వరధర్మచరిత సంభరితం బటంచుఁ
బతులయసన్నిధిఁ బరిపాటి నుందు,
అతివ దుష్టులచేత నాపద యైనఁ
బాపి రక్షింపఁగా భావింపఁ బోలు;
ఓపి యపాయంబు నొనారింపఁ జన్నె !
ఏరియింటికినేని నేపని కైన
నేరీతిఁ బంపుదు విటు నన్ను ? నాఁడు