పుట:ద్విపద భారతము విరాట పర్వము.pdf/97

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

విరాటపర్వము - ఆ -2


మోమునందము జూచి మోదించి తిరిగి
యామీఁద నెఱికప్పునందుఁ జిక్కికొని
క్రమ్మినమోహాంధకారంబుఁ దొలఁగి
క్రమ్మఱు తెన్నెఱుంగక వానిమనము
అలరుఁదోఁటఁ జెలంగునగచరం బనఁగఁ
బలుపోకలను బోయి బాధింప నంతఁ
గినిసి మారునిసేఁతఁ గీచకాగ్రజుఁడు
తనలోన నిట్లని తలపోయఁ దొడఁగె :
“ నాయంత రూపరి నాయంత భోగి
నాయంతరసికుని నాతి రమ్మనదు.
పడఁతుక ననఁ జూచి పలుక కుండుటకు
నుడుగనిసిగ్గు కా నోపుఁ గారణము.
నిడువాలుఁగన్నుల నెమ్మితో నన్నుఁ
బడఁతి చూచిన జస్మఫలము గా కున్నె  ?
పీచ్చుకకుంటు పైఁ బెదగంగ గదలి
వచ్చినట్టుల కాదె వనిత వచ్చినను.”
అని పెక్కుభంగులు నాసింహబలుఁడు
తనలోన సతిరాకఁ దగఁ గోరు చుండె.
అంత నక్కడ భూతలాధీశు దేవి
సంతతపుణ్యం బాంచాలి రప్పించి