పుట:ద్విపద భారతము విరాట పర్వము.pdf/96

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ద్విపద భారతము


యిందుకాంత పవేది నేకాంతసీమ
ముందట మధుమాంసములు పెట్టఁ బనిచి
పలు తెఱంగుల మంచి భక్ష్యభోజ్యములు
తలకొని తెప్పించి తలఁపులో నపుడు
ఆకాంతనయనంబు లసమసాయకుడు
కైకొన్న తూపులుగా నెన్ని యెన్ని,
ఆమంజుభాషిణి యాస్యబింబంబు
తామరపూవుగాఁ దలపోసి పోసి,
ఆరాజముఖికి నొప్పారుపాదములు
కోరికఁ జిగురుటాకులఁ బోల్చి పోల్చి,
ఆసరోజాక్షికి నలరారుజంఘ
లాసాసఁ గాహళు లని యెంచి యెంచి,
పలుపోకలను బోయి పలుమాఱు వగచి
వలపుచేఁ గోల్పోయె వరబుద్ధిబలము.
చెలిపాదములఁ జేరి చెరలాడ దుమికి
నిలువంగ నెడ మీనినెన్నడు మెడలి
ఘనజఘనంబుపైఁ గడువేడ్క నాడి
యనువుమై గరముల నలవోకఁ బ్రాఁకి
చెక్కులనునుపుచేఁ జేరంగ నోడి
చిక్కనితనువెల్లిఁ జేరి ప్రాకుచును