పుట:ద్విపద భారతము విరాట పర్వము.pdf/92

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

78

ద్విపద భారతము


నానగ రన నేల నాకలోకమునఁ
బూని యిమ్మదిరాక్షిఁ బోల రెవ్వరును.
గండుమీలకుఁ బుట్టి కాముబాణముల
దండ నాడుచు నుండుఁ దరుణి నేత్రములు.
ఏలతీఁగలఁ బోలు నీయింతికరము
లలవోక నగు చుండు నబ్జనాళముల.
చెందొవలను బోలి చిగురాకుచాయ
లంది యీకోమలియంఘ్రు లొప్పారె
ఈరామ పలికిన నింపు సొం పగుచుఁ
గీర కోకిలవల్ల కీనాద మెసఁగు.
అట్టి యీ సైరంధ్రి గన్యకామణులు
నెట్టన సరిపోల నేర రెన్వమును.
ఒగి సామభేదదండోపాయములను
మగువఁ బుత్తెమ్ము  ; ధర్మము పల్క నేల"
అనినతమ్మునితోడ నబల యిట్లనియె :
"విను మింక నీజాలి విడిచి నామాట.
పరధన పరదార పరనింద లెపుడు
నరసి చూచిన దోష మాయుష్యహాని .
అందులోఁ బరకాంత యధికపాపంబు
పొందించు మదిఁ గోరి పొందువారలకు.