పుట:ద్విపద భారతము విరాట పర్వము.pdf/91

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

విరాటపర్వము - ఆ -2

77


అతివ నీవే కందు నటుమీఁదిపనులు.
హితము చేసితివేని యే నిన్ను మఱవ. "
అనిన భూవరుదేవి యతనివేగిరముఁ
గనుఁగొని తలయూఁచి కంపించి పలికె:
"ఈ చంద్రముఖియందు నే చక్కఁదనముఁ
జూచి మోహించితి చోద్యంబు గాఁగ?
ఏచూపు లేతీపు లే విలాసంబు
లేచంద మేయంద మే మందు నిన్ను !
వాలారుఁ జూపుల వాలుఁగన్నులను
మేలైననడకల మేలపుమాటలను
సంగీతసాహిత్యసరసభావములు
శృంగారచేష్టలఁ జెలు వైనగతుల
నగవులఁ దగవుల నాగరీకముల
సొగయించి వలపులు సోనగాఁ గురిసి
సురకన్యకలనైన స్రుక్కించునట్టి
తరుణు లున్నారు నీధామంబునందు
చేత వెన్నను బట్టి చిత్తంబు చెదర
నేతికి నై యేడ్చు నీవంటి వాఁడు.”
అనవుడుఁ గీచకుం డతివ మాటలను
విన కిట్లు పలికె" నీ వెడమాట లేల?