పుట:ద్విపద భారతము విరాట పర్వము.pdf/90

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

76

ద్విపద భారతము



కుటిలకుంతల యేను గోపింపఁ గాని
బొటవ్రేలఁ జిమ్ముదు భూరి శైలముల. "
అనపుడు వానిగర్వాలాపములకు
మనసులో గోపించి మదిరాక్షి యనియె:
"మది మది నుండి దుర్మదము వాటించి
కదియఁ జూచెద వేల కాలమృత్యువును ?
రావణాదులు మున్ను రమణికై పోరి
వేవేగఁ దీఱుట విన రాదె చెవుల.
కోర్కి కందనిపండ్లు గోయనె ట్లగును
తర్కింపు మిది నీకు ధర్మంబు గాదు."
అని యిట్లు పాంచాలి యస మీక పలుక
విని కీచకుఁడు శోక వివశాత్ముఁ డగుచుఁ
గ్రమ్మఱఁ దనయప్పకకకు నేతెంచి,
ఇమ్మడి నిట్టూర్పు లినుమడింపంగ
నెంతయుఁ జిన్నపోయిన మోముతోడఁ
గాంత యూరక యుండ, కలగి యిట్లనియె:
"ఏయింతు లైన నీయింతి. బోలుదురె ?
కాయజుదంతి యై కలకంఠి పొలుచు.
ఆయబ్జముఖరూప మాత్మలో నిలిపి
పాయక మదనుఁ డేఁపఁగఁ జొచ్చి నాఁడు.