పుట:ద్విపద భారతము విరాట పర్వము.pdf/89

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

విరాటపర్వము - ఆ -2

75


ద్రౌపది కోపించి కీచకునితో బదులాడుట.

అన విని కోపించి యంభోజునేత్ర
కనుఁగవఁ గెంజాయ కలయంగఁ బర్వ
భయముఁ జూపక మెత్తఁబడఁడు వీఁ డనుచుఁ
బ్రియ మేది నీచుతో బింబోష్ఠి పలికె :
"వలదురా కీచక వలరాజు బారిఁ
గలఁగి యీతీరునఁ గాఱు లాడఁగను.
గంధర్వు లేవురు గలరు నామగలు
సంధులు విదలించి చంపివైచెదరు.
భీమబాహాటోపభిదురప్రతాప
ధాములు నిరుపమోద్దండసాహసులు.
వదలని భుజశక్తి వారికి నీకు
మరిఁ దలంపఁగ హస్తిమశకాంతరంబు. "
అన వాఁడు కోపించి హరిణాక్షి కనియె:
"వనిత ముగ్ధవు గాన వర్ణించె దిట్లు,
ఈలోకమున నాకు నెదురు దెచ్చెదవు.
చాలు నీమాటలు సంతసించితిని.
బలుఁడు భీముఁడు, భూరిబలుఁడు శల్యుండు,
బలు లయ్యు ననుఁ బోల వలఁతులే వారు?