పుట:ద్విపద భారతము విరాట పర్వము.pdf/85

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

విరాటపర్వము - ఆ -2

71


తమకంబు రెట్టింపఁ దనసహోదరికి
సుముఖుఁడై పాంచాలిఁ జూపి యిట్లనియె:

కీచకుఁడు సుదేష్ణను ద్రౌపది తెఱంగడుగుట.

ఈ శాంతకుల మేమి, యెట్టినామంబు
చేకొని యిట కేమి సేయ నేతెంచె?
ఏవెంట విహరించు, నెవ్వాఁడు మగఁడు ?
నీ వెంత మన్నింతు నమ్మితో దీని. "
అనవుడు నతఁడు కామాసక్తుఁ డగుట
మనసులోఁ దెలిసి యమ్మదిరాక్షి యపుడు
“ పరకాంతపై వీనిభావంబు తగిలె.
వరుసతోఁ దప్పింప వలయు నా" కనుచు
మాటల మఱుపెట్ట, మత్తుఁ డై యతఁడు
గాటంపుమరుసాయకంబుల కులికి
సంపంగికై పోవు చంచరీకంబు
సొంపునఁ బాంచాలసుతఁ జేరఁ బోయి
విటలక్షణము లెల్ల వేడ్కతోఁ జూపి
కుటిలకుంతలతోడఁ గొమ రొప్పఁ బలికె:
"తరలాక్షి , నినుఁ బోలుతరుణి నేగాన
నరలోకసురలోక నాగలోకముల.