పుట:ద్విపద భారతము విరాట పర్వము.pdf/84

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

70

ద్విపద భారతము


తనచేష్ట లన్నియు ధైర్యంబుతోన
మనసులో మఱచి తామరసాక్షిఁ జూచు.
అప్పు డప్పయుఁ గొంద ఱజ్జలోచనలు,
దప్పక తనుఁ జూడఁ దగవేది వాఁడు
మెఱుఁగుఁదీవెను బోలు మెలఁతమైఁదీఁగ
తఱ చైనరుచుల కెంతయు సంతసిల్లు.
పవడంపులతఁ బోనిభామకెంగేలు
తివుటమై నున్న కాంతికి మెచ్చి పొగడు.
గండుమీలను బోలు కాంత నేత్రముల
మెం డైనమించు గ్రమ్మిన మిన్నుఁ బ్రాకు.
పున్నమచంద్రుఁ డై పురణించు చున్న
యన్నాతిమోముచాయకు మోము వ్రేల్చు,
ఈచందమునఁ జూచి యింతిపైఁ జూపుఁ
గీచకాగ్రణి యెట్టకేలకుఁ దిగిచి
నలినాక్షియన్వయనామధేయములు
వెలయ సుదేష్ణ చే విందుఁ గా కనుచు
నేతెంచి మ్రొక్కిన నిభరాజగమన
ప్రీతితో బంగారుపీటఁ బెట్టించి
ఘనరత్న ఖచితకంకణపాళి మొరయు
నొనర సంభావించు చున్నచో వాఁడు