పుట:ద్విపద భారతము విరాట పర్వము.pdf/80

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

66

ద్విపద భారతము


తాళంగ నోపక ధరణిపై వాఁడు
కేలుఁ జాపీనఁ జూచి కినుకఁ బో విడిచి
తనకు భూపతి మెచ్చి తగ నిచ్చినట్టి
కనకాంబరాదు లక్కడివారి కిచ్చి
దండిమై నేతెంచి తనచోట నుండె.
మఱియు లావున మాఱుమలయుమల్లరుల
విఱిచి నొప్పించె , భూవిభుసమ్ముఖమున.
తనఘాత కోర్చి భూతలనాధునొద్దఁ
జెనసి పోరాడఁగ జెట్టి లే కున్న
నగరపతి దెప్పింప నగరిలో నెపుడు
గరిహరి శార్దూలగణముతోఁ బెనఁగు.

కీచకుఁడు ద్రౌపదిం గాంచివలచుట.

వెలయుపాండవు నిట్లు విరటు రాజ్యమున
సొలవక వైరిరాజులకన్ను మొఱఁగి
కొండొకకాలంబు కొఱఁత గా కుండ
నిండించునంతకు నెఱి నొక్కనాఁడు
ధరణీశుమఱఁదియు దండనాయకుఁడు
నరయ గర్వాంధుండు నగుసింహబలుఁడు