పుట:ద్విపద భారతము విరాట పర్వము.pdf/79

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

విరాటపర్వము - ఆ -2

65


అప్పుడు భీముఁ డయ్యవనిపాలునకు
డప్పక మఱి వినోదము చూపఁ దలఁచి
యువతాయిలోఁ బెట్టి యుఱక జక్కించి
నిపుణుఁడై వ్రేయక నెఱి గాచి విడుచు.
అరుదెంచి వాఁడు పై నవఘళించుటయు
గురుతరస్థితిఁ దప్పికొని వేగ నిలుచు.
కుప్పించి వాఁడు కాల్గొని రాకమున్నె
తప్పినయట్లుగా ధరఁ గ్రుంగు, మఱియు
వెలయంగ సన్నంపువిన్నాణములకు
దలపడుఁ గాని యంతయు ముట్టఁ గొనఁడు.
కాలినేర్పున వానికా లాన నీక
బాళిచేఁ జే సోఁకఁ బట్టి పో విడుచు.
ఇత్తెఱంగున భీముఁ డెలమితోనృపుని
చిత్తంబునకు వేడ్క చేసి చాలించి
తూగొని కాళ్లు చేతులు వ్రేలునట్లు
భీకరాకృతి వాని పెడకచ్చఁ బట్టి
ముక్కున వాతఁ గ్రమ్ముచు నెత్తు రొలుకఁ
గ్రక్కున వాని నుగ్రత నెత్తి వైచి
పరఁగ నంతటఁ బోక ప్రజ లెల్ల నార్వఁ
బొరిఁ బొరి వానివీపున మండివెట్టి