పుట:ద్విపద భారతము విరాట పర్వము.pdf/77

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

విరాటపర్వము - ఆ -2


ఆహిడింబునిఁ బోలునధికుఁ డీజెట్టి ,
సాహసంబున వీని సాధింప డొరుఁడు,
అగుఁ గాక నేను నీయాజ్ఞ వాటించి
జగజెట్టి నై పోరి చలము సాధింతు.”

భీమసేనుఁడు మల్లువితోడం బెనంగుట

అని యంకణముఁ జొచ్చి యధిపుకట్టదుట
జనులు భీతిల మల్లచఱచి యిట్లనియె:
" లావు జేవయు మీఱ లాగింతు నిపుడు
భూవిభుననుమతంబున మున్ను కడఁగి,
ఎదుట నిల్వు మ” టన్న నితఁడు నాతండు
ముదముతో నొండొరుమోము వీక్షించి
నేల నించుకమన్ను నెఱిఁ బుచ్చుకొనుచు
ఫాలసీమలఁ దాల్చి పైఁ జల్లుకొనుచు
మొగి రెండు చేతులు మునివేళ్లఁ గొంతఁ
దిగిచి యొండొరు లున్న దెసలకై చల్లి
పద నేది బ్రహ్మాండ భాండముల్ పగులఁ
దుదముట్ట నార్చుచుఁ దొడరి యంతటను
నలి రేగి వింతతానకముల నిలిచి
పొలు పొందఁ గవియునప్పుడు చూడ నొప్పె