పుట:ద్విపద భారతము విరాట పర్వము.pdf/75

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

విరాటపర్వము - ఆ -2

61


ఉరుభుజంబులు, రాయు చున్నపెందొడలు,
పొరిఁ బొరిఁ జెవి నొక్క పుష్పమాలిక యు
ధరియించి యొక మహాదైత్యుఁడో యనఁగ
నరిది ఱెక్కలు లేనియచలంబుఁ బోలి
చనుదెంచి నృపునీయస్థానమధ్యమున
జను లెల్ల విస మల్లచఱచి యి ట్లనియె:
"పరిపాటి నెన్నఁ జప్పన్న దేశములఁ
గర మర్థి నే నెఱుంగనిరాజు లేఁడు.
ఏరూపమున నైన నెదు రైనజెట్టి
నేరీతిఁ గాన భూమీశ నీయాన.
చిర కాలమున నుండి జెట్టిమల్లులకు
బిరుదు గట్టినవాడఁ బేర్చి డాకాల,
చెనసి యేనుఁగుచేతి చెఱకుకోలలకు
నెన గారె నాతోడ నేదిరి మల్లరులు ? "
అన విని వాని బాహాటోపవిధముఁ
గనుఁగవ నెలకొన్నగర్వంబుఁ జూచి
ప్రీతితో సభ నున్న బిరుదుమల్లరులు
భీతు లై యెంతయుఁ బెం పేది యపుడు
ఉత్తర మీ లేక యొదిఁగిరి చూడఁ
జిత్తరువందు వ్రాసిన బొమ్మలట్లు,