పుట:ద్విపద భారతము విరాట పర్వము.pdf/70

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

56

ద్విపద భారతము


నతశాత్రవులు వారు నన్ను నేమఱరు,
జతన మై కెలఁకులఁ జరియింతు రెపుడు .
అతివ యెవ్వఁడు నన్ను నభిలాషఁ జూచు
నతని రూపఱఁ జూతు రారాత్రిలోన.
కావున నావంకఁ గడగంట నైన
భావించి చూడరు బ్రహ్మాదు లైన,
కాదు పో నాయిచ్చఁ గన నెంతవాఁడు
నీదు పల్లభుఁ డంత నీచవర్తనుఁడె?
సైరంధ్రి యగుకాంత జగతిలో ధర్మ
చారిణి యై కాదె చరియింప వలయు ?
అనుమతించిన నేలు, మతివ నీ కెపుడు
మనసు రా మెలఁగెద, మన్నింపు మమ్మ.
పనుపకు నన్ను నల్పము లైనపనుల;
వనజాక్షి యిది నాకు వరముగా నిమ్ము."
అనిన సంతోషించి యవనీశు దేవి
తనయొద్దఁ బాంచాలిఁ దగ వొప్ప నునిచె.
అనఘాత్మ యటమీఁద నైనవృత్తాంత
మెనసిన వేడ్కతో నెఱిఁగింతు వినుము.
ఆర్థిమందార సాహసవిక్రమార్క
పార్థివనుతర్యశౌర్య పంటవంశేంద్ర