పుట:ద్విపద భారతము విరాట పర్వము.pdf/7

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

భూమిక.


శ్రీమహాభారతకథ నెఱుంగనివారు హిందువులయం దుండుట యరుదు. అది సర్వనీతిబోధకంబును, సనాతనధర్మనిరూపకంబును, వర్ణాశ్రమాచారవిజ్ఞానప్రదాయకంబును నగుటంజేసి మనపురాతనగ్రంథంబుల నెల్ల నుత్తమం బగుట య ట్లుండ మనోహరకథారత్నంబులకు గని యౌటంజేసి మనవారి కెల్లరకుం బఠనయోగ్యంబగుచున్నది. దుర్యోధనాదులమాయలకు నెల్ల లోఁబడి పాండవులు సిరులం బాసి యరణ్యంబులఁ బండ్రెండేడ్లు వాసము చేసి పదుమూఁడవ యేఁ డజ్ఞాతవాసం బొనర్ప విరాటరాజ్యంబుఁ జేరిరి. అందు వా రొందినరాయిడుల వర్ణించు పర్వము విరాటపర్వము నాఁ బరఁగు.

విరాటపర్వమును సాంతముగఁ జదివినఁ బుత్త్రపౌత్త్రాభివృద్ధియును, గోధనసమృద్ధియుఁ, గామితార్థసిద్ధియుఁ గలుగునని పెద్ద లండ్రు. వాన లేనికాలమునం జదివిన వర్షంబు గురియు ననియు సస్యంబులు పూర్ణఫలం బిచ్చు ననియుం బ్రతీతి