పుట:ద్విపద భారతము విరాట పర్వము.pdf/69

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

విరాటపర్వము - ఆ -1


కలపంబు గలఁప, సింగారంబు చేయ,
తల దువ్వ, పువ్వులు తగఁ గట్ట నేర్తు.
నిత్యము న్మును వెన్ను నికి దేవి యైన
సత్యభామకుఁ బరిచర్య చేయుదును.
తరువాత, బాంచాలి తన్నుగా నన్ను
నరసి పిల్చిన నుంటి నయ్యంతిఁ గొలిచి.
ఇప్పుడు నీ వద్ద నిట్టు లుండెదను
దప్పక, నీచవర్తనలకుఁ జాల."
అనిస భూవిభుదేవి యద్దేవితోడఁ
దనరీతి వివరింపఁ దలఁచి యి ట్లనియె:
"అతివ నీ వేతెంచునప్పుడు మా రాజు
చతురుఁ డై చూచె, భూజనులుఁ గన్నారు
ఆతఁడు నీమీఁద సభిలాష నిలుప
నే తెఱంగున నిన్ను నేను నిల్పుదును ?
కర్కటి యొక వేళ గర్భ మైనట్లు
తర్కింప నాకు మీఁదట నేమి యగునొ ?
అనిన ద్రౌపది మందహాసంబు చేసి
తనరఁ గేకయరాజతనయ కి ట్లనియె:
"చింతించి నీవు తల్బినయట్లు కాదు.
కాంతు లేవురు నాకు గంధర్వు లతివ,