పుట:ద్విపద భారతము విరాట పర్వము.pdf/65

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

విరాటపర్వము - ఆ -1


పదరుచు నేఁ జున్నఁ బాఱు నుంగిడియు
నదురుఁద్రిక్కయు మొదలైన రోగములు,
పను లిన్ని తెఱఁగులఁ బరికింతుఁ గాని
విసువక నేనోప వే ఱొక్కపనికి.
ఇన్నియు నేల ? న న్నే ల నోపినను
గ్రన్ననఁ బశుకోటిఁ గావఁ బో ననుపు."
అనుటయుఁ దనచిత్త మాందోళపడఁగ
జననాధుఁ డర్థితో సహదేవుఁ జూచి
"నీచిత్త మటమీఁద; నీవు నాపసులఁ
గాచుచు గోపవర్గము నెల్ల నేలి
యన్ని కార్యంబుల నరసి మాచేత
మన్నన పడసి నెమ్మది నుండు” మనియె.

ద్రౌపది సైరంధ్రియై సుదేష్ణఁ గొలువ వచ్చుట.

ఏవురు నీరీతి నిలమత్స్యవిభుని
సేవించి యున్నచోఁ జెలువ పాంచాలి
సైరంధ్రవేషంబు సమకూర నపుడు
తోరంపుజడ నూడ్చి తుఱుముగాఁ బెట్టి,
వలపలికై కొంత వ్రాలి యాతుఱుము
పలుమాఱు చెవిమీఁదఁ బరిఢవిల్లంగ,