పుట:ద్విపద భారతము విరాట పర్వము.pdf/58

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ద్విపద భారతము


ఇచ్చేడియకు నాట నెలమిమైఁ గఱప
వచ్చునే ? - యనుటయు వాసవాత్మజుఁడు
"పరిమళంబునఁ బొల్చు పసిఁడిచందమున,
కార మొప్పురుచి నొప్పుకస్తూరిపగిది,
అనఘ యీముగ్ధ నా ట్యము నేర్చెనేని
చెనసి పండినయట్టిచెఱకు గా కున్నె"
అని వేడ్క పుట్టించి యా కార్యమునకు
వినతి నీకొనుటయు విభుఁడు మోదించి
యసమున మన్నించి యాబృహన్నలకు
వెసఁ గప్పురముతోడివీడె మిప్పించి
చెలు వైనతొడవులుఁ జీనాంబరములుఁ
గొలఁది కగ్గల మిచ్చి కొమ రొప్పఁ బలికె:
"ఇచ్చెద నీ చేతి కీ పువ్వుబోణిఁ
జెచ్చెర మృదువుగాఁ జెప్పుమీ విద్య,
చెలులతో నాటలఁ జిక్కి యీబోటి
తలఁపక యొకవేళఁ దప్పు చేసినను
గన్నుల బెదరింతు గాని నీ వలిగి
చిన్నారి నెన్నఁడు శిక్షింప వలదు,
నీకుఁ జెప్పఁగ నేల ? నీవెఱుంగుదువు;
నాకు నీ చెలువ ప్రాణము గాన నంటి.