పుట:ద్విపద భారతము విరాట పర్వము.pdf/48

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

34

ద్విపద భారతము


ప్రజల కొదవెఁ దొట్రుపాటు గావింప;
నిజ మాడ నెవ్వఁడు నేర్చు లోకమున ?
అది యట్టు లుండె, మత్స్యాధీశ వినుము.
చదు రొప్పుకురుభూమి జన్మ దేశంబు,
చెలువార ధర్మజుచెలికాఁడ నేను.
పలుకు లేటికి ? కంకభట్టు నా పేరు.
నెఱవుగా జూదంబు నృపతిలక్షణము
నెఱుఁగుదు; కథలలో నేఁ బ్రవీణుఁడను.
నాకును బగవారు ధనం బెల్లఁ
జేకొని వెడలఁ ద్రోచిన వచ్చి యేను
నీగుణంబులు విని ని న్నొక్క యేఁడు
బా గొప్ప సేవింతుఁ బ్రతినతో ననుచు
రయ మొప్ప వచ్చిన రాక యీరాక,
నియమ మేర్పడ నిట్లు నేర్పుతో నుందు.
ఉపకారమునకుఁ బ్రత్యుపకార మేను
సృప చేయ నోపుదు నెఱి నొక్క యెడను.
ఇది వర్తనము గాఁగ నేఁడు నిండించి
పదిల మై పోవుదుఁ బగవారి గెలువ."
అన విని మనుజేంద్రుఁ డతని కి ట్లనియె
వినయహర్షంబులు విజ్జోడుపడఁగ :