పుట:ద్విపద భారతము విరాట పర్వము.pdf/46

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

32

ద్విపద భారతము


ధర్మజుఁడు యతి వేషమున విరాటుసభకు వచ్చుట.

యతివేషధారి యై యరుదెంచుధర్మ
సుతునిఁ, దప్పక చూచి చోద్యంబు నొంది
తనప్రధానులకు నాతనివంకఁ జూపి
మనసులో హర్షించి మఱియు ని ట్లనియె:
"ఉన్నతి యతినాథు నొనరఁ జూచితిరె?
కన్నులపండు వై కానంగఁ బడియె.
భువనత్రయము నేలుపుణ్యుఁడో యితఁడు ?
అవనిలో భిక్షకుం డని చెప్ప రాదు.
ఓలి నీతనిఁ గొల్చి యుభయపార్శ్వముల
నేలోకో చనుదేర విభతురంగములు :
చెలు వైనమూర్థాభిషిక్తు నీపురుషుఁ
గొలిచి రా రేలొకో కోటిసద్భటులు ?
వెలిగొడుగులనీడ వింజామరలకు
నలవడెఁ దోఁచ నీ యతి భాగ్య రేఖ.
యతి రూపధరుఁ డైన నగుఁ గాక యితని
జతన మై పాయదు సౌభాగ్యలక్ష్మి,
ఈవంకఁ దనకు రా నేమి కారణమొ?
భావింప మన మేమి బ్రాఁతి యీతనికి?