పుట:ద్విపద భారతము విరాట పర్వము.pdf/362

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

350

ద్విపద భారతము.

వివాహమహోత్సవంబునకుఁ బౌరులు మత్స్యపురం బలంకరించుట.

మేడలు ధవళించి మృగనాభి నలఁది
వాడలు శోధించి వఱుదముత్తెములఁ
జెలఁగి మ్రుగ్గులు పెట్టి చీనాంబరముల
కలువడంబులు గట్టి కంబాలు పొదివి
పోఁకమ్రాకులు దాపి పువ్వులు నెఱపి
తాఁ కోర్వఁ దోరణ స్తంభము ల్ని లిపి
మణిగాసనము చేసి మహితరీతులను
అను వొందఁ గల్యాణచిత్రము ల్వ్రాసి
ఘనసారధూళితోఁ గలిపి యొక్కింత
అను వైనజవ్వాజియట్టళ్లు మెత్తి
రంగు మీఱినగోపురములపై నున్న
బంగారుకుండలు ప్రభఁ గాంచఁ దోమి
వెండియుఁ గంబముల్ వివిధతోరణము
లాండొండ వీధుల నొప్పారఁ గట్టి
చెలువ వేగినఁ బ్రోది సేయుచందముల
నెలమిఁ బుప్పోళ్లతో నెల్లఁ గైసేసి
తొడరి కాలాగరుధూమ మెల్లడలఁ
నడలుకొనినఁ గాంతి కలిగి యప్పురము