పుట:ద్విపద భారతము విరాట పర్వము.pdf/361

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

విరాటపర్వము--ఆ-5

349

పాండుపుత్త్రుని కిచ్చి పాంచాలికడకు
మెం డైనతొడవులు మృదులవస్త్రములు
భాసిల్లునొకమంచిపసిఁడిగద్దియయు
దాసీజనంబులుఁ దగురీతి నిచ్చి
కౌంతేయులును దానుఁ గలసి యంతంత
సంతోషమున నున్న సమయంబునందు
ద్విపదుండు హితులుఁ బుత్త్రులుఁదానుఁగూడి
విపులసమ్మోదాబ్ధివీచుల న్మునిఁగి
యుండఁగాఁ గాళీశుఁ డురు శైబ్యవిభుఁడు
దండ నే తేరఁగ ధర్మజాదులును
ఎదు రేగి తొ డ్తెచ్చి యెలమిఁ బూజించి
ముద మావహించిరి మొగి నందఱకును,
వెండియుఁ దమరాజ్యవిభవంబు మెఱసి
పాండవవిరటభూపాలబంధువులు
వచ్చిన విరటుండు వారి బూజించి
యిచ్చకుఁ దగినచో నిమ్ము గావించి
తనవీటిలోన నుత్తర పెండ్లి చాటఁ
బనిచిన భృత్యులుఁ బౌరు లాపురిని