పుట:ద్విపద భారతము విరాట పర్వము.pdf/360

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

348

ద్విపద భారతము.

బెను పొంద నభిమన్యుపెండ్లి గావింపఁ
బొనర నుపప్లావ్యపురముఁ జొచ్చుటయు
"నదె కుమారులతోడ హరి వచ్చె" ననుచు
నెదు రేగి పాండవు లింపు సొం పొందఁ
బుండరీకాక్షుని భువనైకవంద్యుఁ
బాండుభూపతిఁ గన్నపగిది నీక్షీంచి
యానందవివశులై యట మూర్ఛ దెలిసి
జా నొప్పఁ దగినయాచారంబు నడపి
యమరంగ బలముఖ్యు లగుయాదవులకు
సముచితభ క్తితో సత్క్రియ ల్నెరపి
యెంతయుఁ బ్రీతిఁ దా మెసఁగు చుండఁగను
ఇంతులు తనుఁ గొల్వ నిభ రాజగతుల
భాసిల్లి తనయుతోఁ బాంచాలికడకు
నాసుభద్రా దేవి యరుగఁ గానుకలు
సరస నభ్యంతరజనముతో గూడఁ
గర మర్థిఁ బుచ్చుచోఁ గమలాప్తుఁ డంతఁ
బీతాంబరముఁ బోనిపృథులవస్త్రములు
భాతికౌస్తుభలీలఁ బరఁగురత్నములు
వైనతేయునికంటె వడి నేగుహరులు
పూని గోవర్థనంబును బోనికరులు