పుట:ద్విపద భారతము విరాట పర్వము.pdf/36

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


ద్విపద భారతము




అనవుడుఁ గరుణించి యాధర్మ రాజు
పనివడ నకులుఁ దప్పక చూచి పలికె:
"ఏది ప్రొద్దున నైన నీమత్స్యపురికిఁ
బోదము మన మంచుఁ బొదిగూడి యిట్లు
వడి వచ్చుమనవెంటఁ బాంచాలి యకట
వడ దాఁకి రా లేక బడలుఁ జూచితివె?
ఏ చందమున నైన నీచంద్రవదన
మోఁచి తేవలె నీవు మొగిఁ గొంతదవ్వు."
అనవుడు నకులుఁ డయ్యవనీశుమాట
విననివాఁడును బోలె వెస నూర కున్న,
మనుజేంద్రుఁ డప్పుడు మఱి యేమి యనక
యను వొంద సహదేవు నట్ల పల్కుటయు,
గొనకొని యతఁడుఁ గైకొన లేమి నెఱిఁగి,
తనయానతిని గ్రీడి తలఁ దాల్చు నంచు
మఱి ధనంజయుఁ జూచి మనుజవల్లభుఁడు
తఱ చైనకన్నీరు దలఁక నిట్లనియె :
"ఎం తెంత నడచిన నీ మత్స్యనగర
మం తంత దూర మై యరుగు చున్నదియ.
ఈమధ్యమున నుండ నిమ్ము లే దెందు.
నీముగ్ధ రా నోప దిఁక నింద్రతనయ.