పుట:ద్విపద భారతము విరాట పర్వము.pdf/357

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

విరాటపర్వము--ఆ-5

345

గురుభీష్ము లెఱుఁగంగఁ గోర్కి నీ వింకఁ
గురురాజునకుఁ బెద్దకొలువులోపలను
వారలసమయసంవత్సరం బెల్ల
పూరించి రని పల్కు పొమ్ము పొ" మ్మనచుఁ
గంటగించినఁ బోయి కౌర వేంద్రునకు
నంట ధర్తజుమాట లతఁడు దెల్పుటయు

అర్జునుఁడు సమయంబు దాఁటె ననుధుర్యోధనుని భీష్ముఁడు నిందించుట.



బొలుపార వినియును బుద్ధిపెం పేది
కొలు విచ్చి యారాత్రిఁ గురుసైన్యవిభుఁడు
అనుజుఁడుఁ గృపుఁడు దివ్యాపగాసుతుఁడు
నినజుండు ద్రోణుండు నే తెంచి యుండ
దూతఁ బుచ్చుటయును దూత వచ్చుటయును
ఆతఱిఁ జెప్పక యతఁ డిట్టు లనియె:
"ఒప్పార మఱచితి మొకదొడ్డపలుకు ;
చెప్ప లే రైతిరి చేరి మీ రైన;
సమయకాలము మీఱి జంభారిసుతుఁడు
సమరంబు చేయుచోఁ జాలించి మనము
నిను నెఱింగితి మన్న నికృతుఁ డై పోఁడె?
పని లేనిపని గాదె వానితోఁ బోరు