పుట:ద్విపద భారతము విరాట పర్వము.pdf/356

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

344

ద్విపదభారతము

యనువున మార్గమునందుఁ దా విడిసి
యినజుతో ననుజుతో నేకాంత మాడి
"సమయకాలము పోక చనుదెంచెఁ గ్రీడి
క్రమ మెఱుంగక చెప్పె గాంగేయుఁ డపుడు,
ధర్మచిత్తున కిది ధర్మరాజునకు
నర్మిలి నెఱిఁగింత" మని దూతఁ బనిచె.
ఆదూత చనుదెంచి యమసూతిఁ జూచి
చేదోయి ఫాలంబుఁ జేర్చి తాఁ బలికె;
"వడిఁ గ్రీడి యజ్ఞాతవాసవత్సరము
కడవక మున్నె సంగరకౌతుకమునఁ
గురుసేనతోడ మార్కొనఁ బేరువాడె;
విరటసూనుఁడు సాక్షి; వినుఁ డింక మీరు
పోయి తొల్లిటియట్ల భూరిదుర్గముల
జాయాసమేతులై చరియింప వలయు.
నీ వెఱుంగని కార్యనిచయంబు లేదు
భూవల్లభుఁడు చెప్పి పుత్తెంచె" ననఁగ
మానితసత్యుఁ డై మహి నొప్పుధర్మ
సూనుఁ డిట్లను వానిఁ జూచి నవ్వుచును
"తమతోడఁ గ్రీడి యుద్ధము సేయునపుడు
సమయకాలము పోయెఁ జర్చింప మున్నె.