పుట:ద్విపద భారతము విరాట పర్వము.pdf/355

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

విరాటపర్వము--ఆ-5

343

మెఱసి వారలుఁ దాను మేటికాలరులఁ
తఱిమి పాంచాలయాదవముఖ్యు లైన
చుట్టాల రండని శుభ రేఖ లనిపి
రట్టిచో ధర్మజుం డతని వీక్షించి
"వనవాసమున నుండి వచ్చి నీయింట
మనసులోపల నున్నమలినంబు మాన్చి
యఖిలభోగంబులు ననుభవించితిమి
సుఖ మయ్యె; నేఁ డిదె శుభము చేసితివి.
ఎందుఁ జూచినఁ గూర్మి యెసఁగంగ మాకు
విందవు నీవు గోవిందునియట్లు
ర" మ్మని తిగిచి విరటభూమిపాలుఁ
గ్రమ్మఱ బిగి యారఁ గౌఁగలించుటయు
నతఁడు వారలకు మజ్జనము సేయించి
యతివేగమునఁ బ్రీతి నన్న పానములు
తనుపారఁ బెట్టించి తగుగారవంబు
లొనరించి గంధపుప్పోపహారములు
వితతాంబరంబులు వెలలేనిసొమ్ము
లతిభక్తితో నిచ్చి యా మోద మందె.
ఇటఁ గౌరవాధీశుఁ డిభపురంబునకు
భటులుఁ దానును సిగ్గుపడి వచ్చు చుండి