పుట:ద్విపద భారతము విరాట పర్వము.pdf/353

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

విరాటపర్వము--ఆ-5

341

నావంశమును బావనం బయ్యె నింక
నీవారిరుహనేత్ర నిట్లు చేకొనుఁడు”
అన విని ధర్మజుం డమరేంద్రసుతునిఁ
గనుఁగొన విరటుతో గాండీవి పలికె:

ఉత్తరను దనకోడలుగఁ గైకొన నర్జునుం డొప్పికొనుట.


"నృత్తగీతంబులు నిఖిలవాద్యములు
నుత్తర నాచేత నొప్పుగా నేర్చె
కోడ లై యుండఁ జేకొనువాఁడఁ గాని
వేడుక నీయింతి వింతగాఁ దలఁప
వావి దప్పినపనుల్ వరుసఁ బాండవులు
గావింప రది మీకుఁ గానవచ్చినది.
కావున నభిమన్యుఁ గల్యాణధన్యు
నావీరరాజన్యు నమరేంద్రమాన్యుఁ
బురుషుఁ జేసెదు కాక పువ్వుబోణికిని,
చిరకాల మిది నేను జింతించు చుంటి
నిది ధర్మసూనున కిది భీమునకును
ఇది బంధుజనులకు హితకార్య" మనిన
విరటుండు మోదించి విజయు నీక్షించి
చరితార్ధుఁ డై యొప్పి సంభ్రమంబునను