పుట:ద్విపద భారతము విరాట పర్వము.pdf/352

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

340

ద్విపదభారతము

"అతివఁ గైసేసితి" మని ప్రధానులకు
నతియుక్తిఁ జూపుచో నాశ్చర్య మంది
"వలరాజుదీమమో వలుదముత్తియమొ
వెలలేనిపసిఁడియో విమలకౌముదియొ!
పులు గడిగినయాణిముత్తెంబు పోలె
నెలమిఁ గైసేసిన ని ట్లుండ వలదె!"
అని మంత్రివరులు ముక్తాతపత్రములు
వనితకుఁ బట్టించి వరుసఁ దోడ్తేర
నెదు రేగి విరటుండు హితులును దాను
మదిరాక్షిఁ దెచ్చి ధర్మజుమ్రోల నిలిపి
"దేవ యీముద్దియ దేవేంద్రజునకు
దేవి గాఁ జను నని తెచ్చి చూపితిని.
ఈనాతి నీరీతి నితని కిప్పించి
మానేర్పునేరము ల్మఱువంగ వలయు.
మీరు నిల్చుటచేసి మెఱసె నాభూమి
వారక దుర్భిక్షవర్జితం బయ్యె.
మీరు వచ్చుటచేసి మెఱసె నాకీర్తి
ధారుణి నాచంద్రతారకం బయ్యె.
మీరు వచ్చుటచేసి మెఱసి కౌరవులు
యూరక రారు నా యూరిచేరువను.