పుట:ద్విపద భారతము విరాట పర్వము.pdf/348

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

336

ద్విపదభారతము

యతనిఁ గౌఁగిటఁ జేర్చి యాభీము యనుల
నతిసంభ్రమంబున నంత వీక్షించి
చాల భీతిల్లి హస్తము లొప్ప మొగిచి
మౌళిపైఁ జేర్చి ధర్మజుఁ జూచు చుండ
నతిసంభ్రమంబుతో నంత నవ్విభుని
సుతులు సోదరులును జుట్టాలు హితులు
దాదులుఁ బ్రజలుఁ బాంధవజనంబులును
భూ దేవతలుఁ బాండుపుత్త్రులఁ జూడఁ
జనుదెంచి యందంద సందడించుటయు
జననాథుఁ డామూఁకఁ జదియ వ్రేయించి
యమనందనునియాజ్ఞ ననుజులుఁ దాను
సముచితాసమునఁ జతురుఁ డై యుండి
కంచుకిచేతఁ గేకయరాజసుతకుఁ
బాంచాలిఁ గై సేయఁ బను పిచ్చి యనిపి
తనలోనఁ దాను సంతస మందువిభునిఁ
గనుఁగొని ప్రియముతో గాండీవిపలికె
"ఏసంకటము లేక యిచట నజ్ఞాత
వాసవత్సరము నిర్వర్తింపఁ గలిగె.
ఈ వెఱుంగవుగాని యే మున్న తెఱఁగు
నేవెంటఁ గొద లేక హితము చేసితివి.