పుట:ద్విపద భారతము విరాట పర్వము.pdf/346

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

334

ద్విపదభారతము

పాంచాలికై కాదె పవమానసుతుఁడు
ద్రుంచె నక్కీచకుఁ దోడికీచకుల"
అని చెప్పు చున్నచో ననిలసంభవుఁడు
జనలోకపతికి నాసవపుత్త్రుఁ జూపిఁ
“నరనాథ యీబృహన్నల గాఁడె నరుఁడు.
పొరసె నుర్వశిశాపమునఁ బేడితనము;
తగి నృత్తగీతవాద్యముల నుత్తరకు
మిగులంగ నేర్పినమేటి దా నితఁడు.
ఖాండవం బేర్చి యాఖండలుం గెలిచి
ఖండించె నతనికై కాలకేయులను.
గంధర్వపతి గెల్చి గాంధారిసుతుని
బంధమోక్షము చేసె బలియుఁ డై యితఁడు.
మఱియు రాక్షసకోటి మర్దించె" ననిన
మెఱయ సంతోషించి మేదినీశ్వరుఁడు
ఆశ్చర్యమగ్నుఁ డై యపు డైన వారి
నిశ్చయింపఁగ లేక నిర్విణ్ణుఁ డైన
భూమీశ్వరున కింద్రపుత్త్రునిఁ జూపి
భూమింజయుఁడు పల్కెఁ బొలుపు దీపింప:
"ఇతఁడు నీతో మున్ను నెఱుఁగంగ నీక
ధృతి నాజ్ఞ చేసినఁ దెగి చెప్ప వెఱచి