పుట:ద్విపద భారతము విరాట పర్వము.pdf/339

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

విరాటపర్వము--ఆ-5

327

చెలఁగి సంభావన సేయ నున్నాఁడు
నెలకొని మనల మన్నింప నున్నాడు.
మనవంశమునవారి మనుప నున్నాఁడు
మనభాగ్యదేవత మఱియు వే యేల ?"
అని చెప్పి భూపాలు నాశ్చర్యపఱుప
ననుజన్ముఁ జూడక యపుడు ధర్మజుఁడు
తనవ్రేటుగంటిపైఁ దనశాటి వైచి
కినియక యుండెఁ జెక్కిటఁ జేయిఁ జేర్చి.
పతి యంత నిట్టిదోర్బలకళాలోలుఁ
డితఁడె కా యని నిర్ణయింప నేరమిని
"పేడి ర" మ్మని పిల్చి బీభత్సు ననిచి
వేడుకఁ దనపుత్త్రు వీడ్కొల్పి మఱియుఁ
గడుమంచిమణు లిచ్చి కంకు వీడ్కొల్పి
యడరి మంత్రుల నెల్ల ననిచి తా నపుడు
క్రన్ననఁ బోయి కేకయరాజపుత్త్రి
యున్న మందిరసీమ నుదకంబు లాడి
భోజనలేపనపుష్పభోగముల
నాజి చేసినదప్పి నణఁచి నిద్రించె.
అంత నుత్తరుఁ గూడి యతనిమాటలకు
సంతసిల్లుచు నాట్యశాలకై నరుఁడు