పుట:ద్విపద భారతము విరాట పర్వము.pdf/336

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

324

ద్విపదభారతము,

నన్ను సారథిఁ జేసి నయ మొప్పఁ దాను
సన్నుతి రథికుఁ డై సైన్యంబు గదిసి
యందు భూపతిఁ జూచి యచట లేకున్న
ముందట మొనకు నైమున్నాడి పోయి
మొదవు లచ్చట నున్న ముదముతోఁ ద్రిప్పి
కదియు సేనల నెల్ల గాసిల్ల నేసి
సందడిఁ బడక గోచయ మేగునంత
ముందటఁ జను చున్న మొదటి కౌరవులఁ
గనుఁగొని యనిసేయఁ గడఁగుచో బలము
జననాథుఁ గూడి యచ్చలముతో నిల్వ
వారితోఁ బోరాడ వసుధేశ వినుము
ధీరుఁ డౌనతనిమూర్తిని జూడ నరుఁడు
వైరులఁ బరిమార్చుపగిది చూపట్టె.
ఆరీతిపోరాట నతని బాణముల
హతు లైరి సారథు లణఁగె రథ్యములు
గత మయ్యెఁ గరులు వ్రక్కలు వాసె హరులు
మెదిసిరి భటులు భూమికి వ్రాలె విండ్లు
చిదిసిరి సంగ్రామచింతతో దొరలు.
అంతఁ గర్ణుఁడు దాఁకి యసు వెల్లఁ బొలిసి
పంతంబు చెడి పాఱెఁ బ్రజ లెల్ల నవ్వ.