పుట:ద్విపద భారతము విరాట పర్వము.pdf/335

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

విరాటపర్వము-ఆ-౫

323

దివ్యాస్త్రముల మించి దివ్యుల గెల్చి
భవ్యు లై యున్న నేర్పరు లందులోన!
ఏరీతి మరలించి తీవు గోగణము,
కౌరవసేన నొక్కటను గెల్చితివి ?
రారాజు విరిగి యారక యెట్లు పోయె?
నీరణస్థితి మాకు నెఱిగింపు" మనిన

తండ్రి కుత్తరుఁడు కౌరవులతోడి యుద్ధప్రకారముఁ దెలుపుట.


నుత్తరుం డిట్లను "నోమహీనాథ
చిత్తగింపవె యేను సేయ యుద్ధంబు;
గోవుల మరలింపఁ; గురుసేన నొంప.
ఆవేళ నొక్క పుణ్యాత్ముఁ డే తెంచి
తన మేను దేవేంద్రుతను వన నొప్పి
మనగోధనములు ద్రిమ్మర గెల్చె రిపుల,
అది విస్తరించెద నవనీశ వినుము :
కదనంబునకు నేను గర్వించి వెడలి
ధర సంచలింప నుద్ధతధూళి ముంప
నరుగుచు నున్న సైన్యము చూచి వెఱచి
యరదంబు డిగి పాఱ నతఁ డేగుదెంచి
తిరుగఁ దోడ్తెచ్చి యెత్తినభీతి మాన్చి