పుట:ద్విపద భారతము విరాట పర్వము.pdf/334

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

322

ద్విపదభారతము.

నరుఁడు ప్రవేశించి నరనాథుఁ గనినఁ
గర మర్థిఁ బ్రతినమస్కారముల్ చేసి
తగుచోట నునిచి యుత్తరువంకఁ జూచి
మొగమునఁ జిఱునవ్వు మొలవ భూవిభుఁడు
"ఉత్తర, నీవు లోకోత్తరప్రౌఢి
నొత్తినకౌరవవ్యూహంబుఁ జొచ్చి
కృపునిఁ గైకొనక గాంగేయుఁ గైకొనక
నృపునిఁ గైకొనక కానీనుఁ గైకొనక
గురుతనూజాతుని గురునిఁ గైకొనక
వెర వొప్ప సామంతవితతిఁ గైకొనక
కదుపులు మరలించి కదనంబు గెల్చి
త్రిదశవీరులు మెచ్చఁ దివిరి వచ్చితిని.
ఒక పౌఁజు విరిగిన నొకపౌఁజు గదియు
నొకవీరుఁ డోడిన నొకవీరుఁ డడరు!
ఓడినబల మైన నొర తేరివాని
నోడింతు మని కాని యులు కెత్తి పోదు.
నృపునిసన్నిధిఁ గాన నిఖిల సైన్యములుఁ
గపటంబు లేక సంగ్రామంబు సేయు.
ధృతరాష్ట్రసుతు లన్న ధృతి నొక్క రొకరు
కుతలంబు గెలిచినక్రొవ్వాడిమగలు ;