పుట:ద్విపద భారతము విరాట పర్వము.pdf/327

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

విరాటపర్వము----ఆ -5

315

బృహన్నల గెల్చె ననుధర్మజుమాటకుఁ గినిసి విరాటుఁ డతని సారెతో వ్రేయుట.

అని ముట్టఁ గోపించి యానెత్తపలక
నినదంబు ఘనముగా నృపుఁ డాడుటయును
అది లెక్క సేయక యమతనూభవుఁడు
మదిలోన గర్వించి మఱియు ని ట్లనియె
"నరనాథ మనబృహన్నల తేరుమీఁద
నరివీరశౌర్యాపహారి యై నిలిచి
భుజబలం బచటఁ జూపుట చేసి కాదె
నిజముగా గెలిచెను నీకుమారుండు.
అతఁడు తో డై యున్న నమరేంద్రు నైనఁ
గృతకృత్యుఁ డై తాఁకి గెలుచు నుత్తరుఁడు.
అసముఁ డాతఁడు గల్గ నాలంబులోన
బినరుహాక్షున కైన బెదరఁ డుత్తరుఁడు;
అటు లౌట జయ మొందు టబ్రంబె" యనినఁ
గటము లొప్పంగ నుత్కటకోపుఁ డగుచు
నరనాథుఁ డాధర్మనందనుఁ జూచి
"ధరలోనఁ గ్రొత్తచందములు చెప్పదవు;
సారథు లేయూర సమరంబు గెలిచి
శూరు లై యున్నారు చోద్యంబు గాఁగ?