పుట:ద్విపద భారతము విరాట పర్వము.pdf/325

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

విరాటపర్వము----ఆ -5

313

అని మంత్రులకుఁ జెప్పి యాగోపకులకు
ధనధాన్యమణు లిచ్చి ధర్మజుఁ జూచి
యొత్తిన వేడ్కతో నొగి "నెక్కిపలక
నెత్త మాడుద" మన నృపుఁ జూచి యతఁడు
"నీవు సుమాళించి నిన్ను నీ వెఱుఁగ
వీ వేళ నీతోడ నే నాడ" ననిన
నించుక నగుచు ధాత్రీశుఁ డచ్చోటఁ
బాంచాలిచేత నప్పలక! దెప్పించి
సారెలు దిగిచి "యీసారి ర" మ్మనిన
నారసి ధర్మజుండనవీశుతోడ
"ఈజూదమునఁ గాదె యెలమి ధర్మజుఁడు
రాజచిహ్నము లోడి రాజ్యంబు నోడి
యనుజుల నోడి పుణ్యాంగన నోడి
వనముఁ గొల్వఁగఁ బోయె వలదు జూదంబు"
అనియు సారెల నంది యాడంగఁ దొడఁగె.
అను వైనచోటఁ దా మర్థి నిద్దఱును
చవ్వంచ దుగయును సతయు దుచ్చౌక
తివ్వంచ భార యిత్తిగయు వేఁడుచును
ఆడఁగ విరటుఁ డిట్లనుఁ "గంకుభట్ట
కూడినకురుసేన ఘోరాజిఁ దాఁకి