పుట:ద్విపద భారతము విరాట పర్వము.pdf/324

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

312

ద్విపద భారతము.


బటల మై పొడమిన బాష్ప బిందువులు
పటునఖంబుల నూడ్చి పాఱ జబ్లుచును
సకలమంత్రులం జూచి చాల గర్వించి
యకలంక చిత్తుం డై యర్థి నిట్లనియె
"ఇది గాక సంతోష మిది గాక తేజ
మిది గాదే సత్పుత్రు నిలఁగాంచు ఫలము?
అర్జునుండన మించి యఖిలకౌరవుల
నిర్జించె మద్వంశనిస్తారకుండు !
కరిరాజముల మీఁద ఘంట లెత్తించి
పురిలోసఁ జాటఁ బంపుఁడు వానిజయము.
వేదపారగు లైనవిప్రపుంగ వుల
వాదిత్రముల తోడ వారువంబులను
వరరథప్రతతుల భధ్రద్విపముల
గురుశౌర్యరంజితకోటిసైనికులఁ
బొదివి కై చేసినపుణ్యభామినుల
నెదురుగాఁ బుచ్చుఁడు హితులెల్లఁ బొండు
మకర తోరణములు మణితోరణములు
ముకురతోరణములు మొగి నెత్తికొనుదు
నతివలుఁ దానుఁ బుష్పాక్షత ల్గొనుచు
హితరీతి నుతర నెదురు పొ మనుడు"