పుట:ద్విపద భారతము విరాట పర్వము.pdf/323

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

విరాటపర్వము----ఆ -5

311

"నేమి సేయుదు నింక ? నెల్లసైన్యములు
భీమయుద్ధము చేసి పెద్ద నొచ్చినవి.
పోటులు దాఁకక పొడ వైనవారిఁ
బాటించి రిఫులపైఁ బంపెదఁ గాక.
మునుపు రా లే వైతి! ముద్దుపాపనికి
ననిలోన నేచంద మయ్యెనో నేఁడు? "
అని తలపోయునయ్యవసరంబునను
బనివడి యొక్క గోపాలుఁ డే తెంచి
నరపతిఁ గాంచి "భూనాథ మీకొడుకు
గురుబలాధిక మైనకురుసేన గెలిచి
యాలమూఁకలు ద్రిప్పి యాలంబులోనఁ
గాల ముల్గాడక గౌరీశుకృపను
సారథియును దానుఁ జనుదెంచు చుండి
వారలయీ మేలువార్త చెప్పుటకు
మున్నాడి పొ మ్మని మొగి నన్నుఁ బనుపఁ
జెన్నార నేను వచ్చినరాక" యనిన

ఉత్తరుఁడు జయించినాఁ డనుమాట విని


   

విరాటుఁడు సంతసిల్లుట.



జననాధుఁ డానందజలధిలో మునిగి
తనువునఁ బులక లెంతయు విస్తరిల్లఁ