పుట:ద్విపద భారతము విరాట పర్వము.pdf/321

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

విరాటపర్వము----ఆ -5

309

వందిమాగధకోటి వరుసఁ గీర్తింప
మందిరద్వారంబు మఱి చేరి నిల్చి
"యలసి వచ్చితి" రని యాసేన నంపి
యెలమిఁ బాండవులును హితులు నేతేర
హరిమధ్యలును గొల్వ నంతఃపురమున
కరు దెంచి రత్నసింహాసనంబునను
నుఖలీలఁ గూర్చుండి సుముఖుఁ డై పద్మ
ముఖిఁ జూచి మోహంబు మొనయ నిట్లనియె
“ఉత్తరుఁ డెచ్చోట నున్న వాఁ ?" డనిన
మత్తకోకిలవాణి మనుజేంద్రుఁ జూచి
ఉత్తరుఁడు యుద్ధమునకుఁ బోయినాఁ డని విని

విరాటుఁడు పరితపించుట


 
"వినవయ్య తెలిపెద విరట భూపాల
మనమీఁదఁ గురురాజు మచ్చరం బెత్తి
తానును గురుఁడు. మందాకినీసుతుఁడు
భానుజకృపులు సౌబల ద్రోణసుతులు
నెఱయు సైన్యముతోడ నెఱబీర మొప్పఁ
బఱతెంచి మనయూరిపనులఁ బట్టుటయు
నగధీరుఁ డై బృహన్నల దేరు గడపఁ
దగఁ గూయివోయె ను త్తరకుమారుండు"