పుట:ద్విపద భారతము విరాట పర్వము.pdf/320

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

308

ద్విపదభారతము.

అరుదెంచునంత నొయ్యనఁ గొల్వు విరిసి
సురరాజు మునులతో సురలతోఁ గూడి
నరునిఁ గీర్తించుచు నరుని మెచ్చుచును
నరుఁడు నారాయణునకు నాత్మ యనుచు
నది ప్రసంగంబుగా నానంద మంది
త్రిదివంబునకు బోయి తెఱుఁ గొప్ప నుండె.
అప్పు డుత్తరుఁ జూచి యాక్రీడి పలికె
"చెప్పి పంపుము నీదుసేమంబు పురికి
గోపాలకులు వీరె కొలిచి యున్నారు
నీపంపు సేయఁ బూనినవార" లనిన
రాజనందనుఁడు వారలఁ జేరఁ బిలిచి
యోజించి పంపె మహోత్సవంబునకు.
అంతకు మున్నె మత్స్యాధీశుఁ డచటఁ
గౌంతేయుఁడును దాను గదనంబు గెలిచి
మెం డైనచీరలు మెఱుఁగారుమణులు
దండనాయకులకుఁ దగఁ గట్ట నిచ్చి
విభవ దేవేంద్రుఁ డై వెసమత్స్యపురము
శుభముహూర్తంబున సొత్తెంచునపుడు
చెలఁగి పుణ్యస్త్రీలు సేసలు చల్ల
నలఘువిప్రులు పుణ్యు లాశీర్వదింప