పుట:ద్విపద భారతము విరాట పర్వము.pdf/318

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

306

ద్విపదభారతము.

ఉత్తరాయనమున నుండిభాస్కరుఁడు
క్రొత్తగా యామ్యదిక్కున కేగునట్లు
మీఱి యే తెంచుచు మెఱయ మార్గమునఁ
బాఱ నోపక పోవుభటుల నీక్షించి
"వెఱవకుఁ డోరి మీవిభుఁ గూడి పొండు
నెఱి మిమ్ముఁ జంప మన్నించితి " ననుచు
నభయహస్తం బిచ్చి యా సేన చేత
శుభ మైనదీవెన ల్పొరిది బొందుచును

ఉత్తరునితో నర్జునుఁడు తన్నుఁ బ్రకటింప వల దని చెప్పుట.


ఒకకొంత ద వ్వేగి యుత్తరుఁ బలికె
"ప్రకటింప వలదు భూపతితోడ నన్ను ;
కురుసేన గెల్చిన గురుశక్తి , యెల్లఁ
గర మొప్ప నీశక్తిగాఁ బ్రతిష్ఠింపు.
తనరూపు నెన్నఁడు ధర్మనందనుఁడు
మనుజుల కెఱిఁగించు మనుజేంద్రతనయ
మాకు నప్పుడు గాని మాతోడివిధముఁ
గైకొని వర్తింపఁ గాదు కావునను
రథికుండ వీవు సారథి నే నటంచుఁ
బృధివీశునకుఁ దెల్పు ప్రియముతో, ననిన